
గజరాజుల జపాన్ యాత్ర
బొమ్మనహళ్లి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్ నుంచి 4 గజరాజులు జపాన్‌కు బయల్దేరాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఎగిరిపోయాయి. ఏనుగులకు ఎంత అదృష్టం అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ జంతువుల మార్పిడి పథకంలో భాగంగా ఒక మగ ఏనుగు, మూడు ఆడ ఏనుగులను జూ అధికారులు జపాన్‌కు పంపించారు. ఇందుకు బదులుగా జపాన్ నుంచి 4 చిరుత పులులు, 4 ప్యూమా (పర్వత సింహాలు), 3 చింపాంజీలు, 8 క్యాపుచిన్ కోతులను బన్నేరుఘట్ట జూ కి పంపిస్తారు.
ఏనుగుల వెంట సిబ్బంది కూడా
= సురేష్ (8 ఏళ్లు), గౌరి (9), శృతి (7), తులసి (5) అనే ఏనుగులను సరుకు రవాణా విమానంలో జపాన్‌కు తరలించారు. విమానంలో ఏనుగులు తినడానికి అరటిపండ్లు, కాయగూరలను తీసుకెళ్లారు.
= అవి సుమారు 8 గంటల పాటు ప్రయాణం చేశాక ఒసాకా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి హిమేజీ సెంట్రల్ పార్క్‌కు తీసుకెళ్తారు.
= జపాన్‌లో తిండి, పరిస్థితులకు అలవాటు పడేలా వాటికి బన్నేరుఘట్ట జూలో కొన్ని నెలలుగా శిక్షణనిచ్చారు. జపనీస్ జూ నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
= అక్కడ రెండువారాల పాటు చూసుకోవడానికి బన్నేరుఘట్ట జూ అధికారులు, మావటీలు కూడా వెళ్లినట్లు జూ డైరెక్టర్ సూర్యసేన్ తెలిపారు.
= కొత్త ప్రదేశంలో అవి ఒంటరి అనుకోకుండా బన్నేరుఘట్ట జూ మావటీలు, సిబ్బంది తోడు ఉంటారు.
= గజరాజులు అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాక సిబ్బంది బెంగళూరుకు తిరిగి వస్తారు.
= ఏనుగులకు సాటి ఏనుగులు, జూ సిబ్బంది భారంగా వీడ్కోలు పలికారు. ఇక రాబోయే కొత్త జంతువుల కోసం వేచి చూస్తున్నారు.
బన్నేరుఘట్ట నుంచి పయనం
ఇక అక్కడే శాశ్వత మకాం
జపాన్ నుంచి రానున్న చిరుతలు, ప్యూమాలు, చింపాజీలు, క్యాపుచిన్ కోతులు

గజరాజుల జపాన్ యాత్ర

గజరాజుల జపాన్ యాత్ర