
చారిత్రక కోటలకు అలంకరణ
రాయచూరు రూరల్: జిల్లాలో చారిత్రక కోటల సంరక్షణతో పాటు అలంకరణ ముఖ్యమని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని మక్కా దర్వాజ వద్ద కోటలకు నూతనంగా రంగు రంగుల విద్యుత్ దీపాలను అమర్చి మాట్లాడారు. బెంగళూరు విధానసౌధ మాదిరిగా భవిష్యత్తులో నిత్యం అలాగే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బాధ్యతలను లక్సా లైటింగ్ టెక్నాలజీ కంపెనీకి అప్పగించామన్నారు. అంబేడ్కర్ సర్కిల్‌లో 3డి డిజైన్‌ను చేయడం, విగ్రహం, రాజ్యాంగ పుస్తకం, పార్లమెంట్ మాదిరిగా రూపొందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గ్రీన్ పార్క్, బ్యారికేడ్ గోడ, అంబేడ్కర్ భవన నిర్మాణాలు చేపడతామన్నారు.

చారిత్రక కోటలకు అలంకరణ