
మాజీ జెడ్పీ సభ్యుడు మృతి
రాయచూరు రూరల్: మాజీ జెడ్పీ సభ్యుడు, నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బసవరాజరెడ్డి(63) సోమవారం రాత్రి మృతి చెందారు. జెడ్పీ సభ్యుడిగా గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలను పొందారు. ఐదేళ్ల పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని నగరసభ కై వసం చేసుకొనేలా సేవలు అందించారు. గత ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఆయన మృతికి మంత్రి బోసురాజు, మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, ఇతర కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
విద్యతో సమస్యలు దూరం
రాయచూరు రూరల్: సమాజంలో మనిషి సమస్యల పరిష్కారానికి విద్య ప్రధానమని అదనపు జిల్లా న్యాయమూర్తి స్వాతిక్ పేర్కొన్నారు. మంగళవారం బాల మందిరంలో జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి పాసైన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభకు తగ్గట్లుగా కష్టాలను ఎదిరించి తమ సామర్థ్యాన్ని చాటుకోవాలన్నారు. డీఎస్పీ శాంతవీర, జిల్లా పిల్లల సంరక్షణ అధికారులు మంగళ హెగ్డే, అమరేష్, రాధాదేవి, శారద, భారతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.