
యరగేరాను తాలూకాగా ప్రకటించాలి
రాయచూరు రూరల్: రాయచూరు నగరం నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులోని కావేరి నివాసంలో ఆందోళన చేపట్టిన సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రజలకు అనూకులమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. యరగేరా వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందని, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167, యరగేరా పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలున్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రికి విన్నవించామన్నారు. ఆందోళనలో బసవరాజ్, మహబూబ్ పటేల్, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు.
జాతీయ జెండా దినోత్సవం
రాయచూరు రూరల్: నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ జెండా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత సేవాదళ్ కార్యదర్శి హిరేమఠ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు జాతీయ జెండాపై అవగాహన కల్పించవచ్చన్నారు. కార్యక్రమంలో విద్యాసాగర్, దానమ్మ తదితరులున్నారు.
ఎలుగుబంటి దాడిలో
రైతుకు తీవ్ర గాయాలు
● ప్రాణపాయ స్థితిలో
కొట్టుమిట్టాడుతున్న రైతన్న
సాక్షి,బళ్లారి: తాలూకాలోని సంజీవరాయనకోటె గ్రామంలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం సంజీవరాయనకోటె గ్రామానికి చెందిన రాజు(55) అనే రైతు తన పొలంలో పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లడంతో ఉన్న ఫళంగా ఎలుగుబంటి దాడి చేయడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, శరీరంపై ఎలుగుబంటి తీవ్రంగా గాయాలు చేసింది. ఈ విషయం చుట్టు పక్కల వారు తెలుసుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన రైతు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఎలుగుబంట్లు పొలాల్లోని రైతులపై పదేపదే దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తనిఖీ చేసి ఆ ప్రాంతంలో ఎలుగుబంట్ల బెడద తప్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

యరగేరాను తాలూకాగా ప్రకటించాలి

యరగేరాను తాలూకాగా ప్రకటించాలి