
తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి
రాయచూరు రూరల్: తాగునీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యాలయం అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు మంగళవారం కార్యాలయాన్ని ముట్టడించిన ఘటన రాయచూరు తాలూకా మర్చేడ్‌లో జరిగింది. గత నెల రోజుల నుంచి తాగునీరందించాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలు చేతపట్టుకొని పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.
చెరువులో మునిగి
యువకుడు దుర్మరణం
రాయచూరు రూరల్: చెరువులో మునిగి ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో చోటు చేసుకుంది. రబ్బణకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని జయనగర్ క్యాంపునకు చెందిన దండమూడి బాలకృష్ణ అనే రైతు చెరువులో మునిగి మరణించిన యువకుడిని మాన్విలోని మహాత్మా గాంధీ కాలనీకి చెందిన నాగరాజ్ బోవి(23)గా పోలీసులు గుర్తించారు. చెరువులో ఈత నేర్పేందుకు వెళ్లిన నాగరాజ్ బురదలో చిక్కుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ చెరువు వద్దకు చేరుకుని అధికారులతో చర్చించి మృతదేహాన్ని సత్వరం వెలికి తీయాలని సూచించారు.
హత్య కేసు నిందితులపై పోలీసు కాల్పులు ●
● ఇద్దరి కాళ్లకు తూటా గాయాలు
● తప్పించుకుని నలుగురు పరారీ
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితులపై పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు హత్య కేసు నిందితుల కాళ్లకు తూటాలు తగిలిన గాయాలయ్యాయి. మంగళవారం విజయపుర నగరంలో ఎస్‌ఎస్ కాంప్లెక్స్‌లో వర్షిణి బ్యాంకు ఆవరణలో నళిని కుమార్ కాళే అనే వ్యక్తిపై హత్యాయత్నం చేయడంతో పిస్తోల్, మారణాయుధాలతో పరారయ్యారు. నళిని కుమార్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మృతి చెందారు.ఈ ఘటనపై హత్య కేసు నమోదు కావడంతో నిందితుల గాలింపు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయగా తప్పించుకుని పారిపోతున్న తరుణంలో పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మరో నలుగురు తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
పుస్తకావిష్కరణ
రాయచూరు రూరల్: సమాజంలో అణగారిపోతున్న సంప్రదాయాలను కాపాడడానికి విప్లవకారులకు పాటలే ప్రాణవాయువు, పోరాటమే మార్గదర్శనం అని కేఆర్‌ఎస్ సంచాలకుడు మానసయ్య పేర్కొన్నారు. సోమవారం సింధనూరులో మస్కి ప్రకాశన ఆధ్వర్యంలో అంబేడ్కర్ మీరు ఎవరు? అనే పుస్తకాన్ని విడుదల చేసి మాట్లాడారు. రాజ్యాంగం అనుసరించి జారీ చేసిన అంశాలను గురించి ప్రస్తావించారు. దానప్ప నీలగల్ రాసిన పాటలు మనస్సును దోచిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో విరుపాక్షి, పూజార్, అంబన్న, రాజు, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగానిదే భవిష్యత్తు
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వైద్యరంగానికి భవిష్యత్తు ఉందని జిల్లా ఔషధ నియంత్రణాధికారి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నవోదయ వైద్య కళాశాల ఔషధ ఆడిటోరియాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు మ్యూజియం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రాయచూరు నవోదయ వైద్య కళాశాలలో డోసేజ్ ఫార్‌మ్స్, మాలిక్యూలర్, మానవ శరీర రచన, క్రియా శాస్త్రాలు, మందుల ప్రాక్టీస్ వంటివి ఉపయోగమన్నారు. నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, అమృతరెడ్డి, డీ.దేవానంద, అరుణ కుమార్ నాయక్, దొడ్డయ్య, సూధన కుమారి, కౌశిక్ రెడ్డి, శ్యామల తదితరులున్నారు.

తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి

తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి

తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి