
హులిగమ్మకు కనక వర్షం
హుబ్లీ: కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసిన హులిగమ్మ దేవి ఆలయ హుండీ కానుకలను లెక్కించారు. ఆ మేరకు 40 రోజుల్లో మొత్తం రూ.1,17,52,515ల ఆదాయం వచ్చింది. ముడి బంగారం 133 గ్రాములు, 10 కేజీల వెండి వస్తువులు కానుకలుగా వచ్చాయి. హులిగమ్మ ఆలయానికి ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. పున్నమి, అమావాస్య, అలాగే మంగళ, శుక్రవారాల్లో లక్ష మందికి పైగా భక్తులు హులిగమ్మను దర్శించుకుంటారు. మొన్నటి గురుపౌర్ణమి సందర్భంగా విశేషంగా భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకొని దర్శనం చేసుకున్నారు. భక్తులు విశేషంగా ధన, ధాన్య, కనక రాశులను కానుకలుగా అర్పిస్తారు. జూన్ 5 నుంచి జూలై 14 వరకు హుండీల్లో నిల్వ చేరిన కానుకలను సోమవారం లెక్కించినట్లు ఆలయ ఈఓ ఓ ప్రకటనలో తెలిపారు.
రూ.కోటి దాటిన ఆలయ హుండీ ఆదాయం