సాక్షి,బళ్లారి: బళ్లారి రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఐజీపీ)గా వర్తిక కటియార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు బళ్లారి రేంజ్ ఐజీపీగా పని చేసిన లోకేష్‌కుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం బెంగళూరులో గృహరక్షక, పౌరరక్షణ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న వర్తిక కటియార్‌ను బళ్లారి రేంజ్ ఐజీపీగా నియమించారు. ఈమె 2010 ఐపీఎస్ అధికారిణి కాగా, రాష్ట్రంలో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు గడించారు. బళ్లారి రేంజ్ ఐజీపీ పోస్టు ఖాళీ పడటంతో ఆమెను ప్రభుత్వం కొత్త ఐజీపీగా నియమించింది. ప్రస్తుతం బళ్లారి ఎస్పీగా కూడా మహిళా అధికారిణి శోభారాణి పని చేస్తుండటంతో ఐజీపీగా కూడా మహిళనే నియమించడంతో ఇద్దరు పోలీసు బాస్‌లు మహిళలే కావడం విశేషం. జిల్లాలో తొలిసారిగా మహిళా పోలీసు బాస్‌ల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధులు నిర్వహించే అవకాశం కలిగింది. అలాగే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని విజయనగర జిల్లా ఎస్పీగా కూడా జాహ్నవి అనే మహిళా అధికారిణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు విజయనగర జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీహరిబాబు బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో విజయనగర జిల్లా తొలి మహిళా ఎస్పీగా జాహ్నవి అధికార బాధ్యతలు చేపట్టబోతున్నారు. బళ్లారి రేంజ్ పరిధిలో విజయనగర జిల్లా కూడా ఉండటంతో బళ్లారి, విజయనగర రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు మహిళలే కావడంతో పాటు రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో రెండు జిల్లాలకు పోలీసు బాస్‌లు మహిళామణులే. బళ్లారి, విజయనగర జిల్లాలకు మహిళా ఎస్పీలు, రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్‌కు పని చేసే అవకాశం లభిస్తుండటం విశేషం అని చెప్పవచ్చు.
బళ్లారి రేంజ్ ఐజీపీగా వర్తిక కటియార్
విజయనగర జిల్లా ఎస్పీగా జాహ్నవి నియామకం
ఉమ్మడి బళ్లారి జిల్లాకు ఇద్దరు మహిళా పోలీసు బాస్‌లు
మహిళా ఐజీపీ నియామకంతో
ఎస్పీ, ఐజీపీ ఇద్దరూ మహిళలే
బాగల్‌కోటె ఎస్పీగా సిద్దార్థ గోయల్
రాయచూరు రూరల్: బాగల్‌కోటె జిల్లా ఎస్పీగా సిద్దార్థ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. బాగల్‌కోటె జిల్లా ఎస్పీగా కొనసాగిన అమర్‌నాథరెడ్డిని మైసూరుకు బదిలీ చేశారు.
విజయనగర జిల్లా కొత్త ఎస్పీగా జాహ్నవి నియామకం
హొసపేటె: విజయనగర జిల్లాకు కొత్త ఎస్పీగా జాహ్నవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమె అధికార బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్పీగా ఉన్న డాక్టర్ బీఎల్ శ్రీహరిబాబు బెంగళూరుకు బదిలీ అయ్యారు. 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి జాహ్నవి విజయనగర జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయ్యారు.
గదగ్ జిల్లా నూతన ఎస్పీగా రోహన్ జగదీశ్
హుబ్లీ: గదగ్ జిల్లా నూతన ఎస్పీగా 2019వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రోహన్ జగదీశ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను వెల్లడించింది. బెళగావి నగర శాంతి భద్రతల విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రోహన్ జగదీశ్‌ను తక్షణమే జారీలోకి వచ్చేలా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గత మూడేళ్ల నుంచి గదగ్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన వీఎస్ నేమగౌడను బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీగా నియమించారు.
అధికారుల బదిలీకి వేళాయె
అధికారుల బదిలీకి వేళాయె
అధికారుల బదిలీకి వేళాయె