
ఆర్టీసీ బస్సుల్లో ధ్వని స్పందన యంత్రం అమరిక
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థలో 7000 కొత్త బస్సులకు ధ్వని స్పందన యంత్రం అమర్చనున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రాలయ మఠంలో రాఘవేంద్ర స్వాముల దర్శనం పొందిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రవణ లోపం ఉన్న వారికి యంత్రాలను అందించామన్నారు. బెంగళూరులో 125, మైసూరులో 200 బస్సులకు ధ్వని స్పందన యంత్రాలను అమర్చినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ న్యూఢిల్లీ ఐఐటీ సంస్థ, జీ ఐజడ్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగులకు అనుకూలమయ్యే విధంగా అవకాశాలు కల్పించామన్నారు. మంత్రాలయంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నూతనంగా నిర్మించిన భవనాలు, పాత భవనాలను మంత్రి పరిశీలించారు. కాగా పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ మఠంలో మంత్రి రామలింగారెడ్డిని శాలువా కిప్పి సన్మానించి జ్ఞాపికను అందించారు.