
శక్తి పథకం.. మహిళలకు గర్వకారణం
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి పథకం మహిళలకు గర్వకారణమని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. సోమవారం నగరంలో ఆర్‌టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన శక్తి పథకం సంభ్రమాచరణలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం ఐదు హామీ పథకాలను ప్రకటించిందని గుర్తు చేశారు. హుడా అధ్యక్షుడు ఇమాం, పార్టీ నేతలు కురి శివమూర్తి తదితరులు పాల్గొన్నారు.
శక్తితో మహిళలకు ఎంతో లబ్ధి
చెళ్లకెరె రూరల్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అమలులోకి తెచ్చిన శక్తి యోజన పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగపడిందని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన సోమవారం కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో శక్తి పథకం సంభ్రమాచరణలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందున ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అపార నమ్మకం ఏర్పడిందన్నారు. తహసీల్దార్ రెహన్ పాషా, గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు గద్దిగె తిప్పయ్యస్వామి, నగరసభ అధ్యక్షురాలు శిల్పా మురళీధర్, ఉపాధ్యక్షురాలు కవితా బోరయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరభద్రయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
మహిళలకు ఆసరా శక్తి పథకం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీల్లో ఒకటైన శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆసరా అయిందని పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆర్డీఏ అధ్యక్షుడు రాజశేఖర్, పవన్ పాటిల్, సభ్యులు నాగేంద్ర, శశికళ, ఉరుకుందప్ప, మంజుల, అధికారులు చంద్రశేఖర్, హుడేద్, నవీన్ కుమార్, హరీష్, గవిసిద్దప్పలున్నారు.
ఉచిత ప్రయాణంతో మహిళల్లో ఆనందం
–బళ్లారిలో శక్తి సంబరాల్లో మేయర్ నందీష్
బళ్లారిఅర్బన్: పేదలు, శ్రామిక మహిళలకు మనోబలాన్ని ఇచ్చే నారీ శక్తి ఉచిత ప్రయాణం వల్ల మహిళల్లో ఆనందోత్సవాలతో పాటు ఆలయాల సందర్శన తదితర మంచి పనులకు ఎంతో ఉపయోగపడుతోందని బళ్లారి మేయర్ ముల్లంగి నందీష్ తెలిపారు. కేంద్ర బస్టాండ్‌లో సంబంధిత నారీ శక్తి పథకం 500 కోట్ల మహిళల ప్రయాణ సంబరాల వేడుకల్లో ఆయన మహిళా ప్రయాణికులకు మిఠాయిలను పంచి పెట్టి మాట్లాడారు. పథకాల అమలు సమితి జిల్లా అధ్యక్షుడు కేఈ చిదానందప్ప, డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం చర్మ పరిశ్రమల సంస్థ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్, జిల్లా ఎస్పీ డాక్టర్ శోభారాణి తదితరులు మహిళా ప్రయాణికులకు మిఠాయిలు పంచి పెట్టి స్పూర్తిప్రదాయక మహిళా సాధకుల పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రముఖులు డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, నాగభూషణగౌడ, ఆర్‌టీసీ డీసీ వినాయక్ భగవాన్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గవియప్ప

శక్తి పథకం.. మహిళలకు గర్వకారణం

శక్తి పథకం.. మహిళలకు గర్వకారణం

శక్తి పథకం.. మహిళలకు గర్వకారణం