
హృదయం క్షేమం
యోగా, వ్యాయామం, మంచి ఆహారం..
బనశంకరి: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు, మధ్య వయస్కులు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. దీనిపై అనేక ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు మరోసారి దీనిపై స్పందించారు. హృదయఘాతాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, ఆ టీకా పట్ల ప్రజల్లో ఎలాంటి అనుమానం వద్దు అని వైద్యవిద్యా మంత్రి డాక్టర్ శరణప్రకాష్ పాటిల్ తెలిపారు. మంగళవారం వికాససౌధలో ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. గుండెపోటు పట్ల యువకులు భయపడాల్సిన పని లేదు. గంటపాటు యోగా, వ్యాయామం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. పాశ్చాత్య దేశ ఆహార పద్ధతి వద్దు, పూర్వపు ఆహార విధానాలను పాటించాలని అని సూచించారు.
వీధి ఆహారంపై దృష్టి
మంత్రి దినేశ్ మాట్లాడుతూ.. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదన్నారు. రోడ్ల పక్కన ఆహారం, ఆహారం తయారీ విధానాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని, వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవాలని తెలిపారు.
వైద్య ఆరోగ్య మంత్రుల ప్రకటన
గుండెపోటు మరణాలకు, కోవిడ్
టీకాకు సంబంధం లేదు
యువత మంచి జీవనశైలిని పాటించాలి
బడికి వెళ్తూ బాలిక..
సాక్షి, బళ్లారి: బాలిక పాఠశాలకు వెళుతూ కుప్పకూలిపోయింది. మంగళవారం బళ్లారి జిల్లాలోని సండూరు తాలూకా కాళింగేరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దీక్ష (12).. రోజూ మాదిరిగానే ఇంటి నుంచి బడికి బయలుదేరింది. నడుస్తూ ఉండగానే పడిపోయింది. స్థానికులు బాలికను ఆస్పత్రి తరలించేలోగా కన్నుమూసింది. బాలిక మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే చెప్పగలమని వైద్యులు పేర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృతి చెందుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షుగర్, కాలేయ జబ్బులు అధికం
హాసన్‌లో గుండెపోటు మరణాలు పెరగలేదన్నారు. 23 మంది మృతులపై అధ్యయనం చేశామని, 10 మందికి గుండె సమస్య ఉన్నట్లు తెలిసిందని మంత్రి పాటిల్ చెప్పారు.
కోవిడ్ తరువాత ప్రజల జీవనశైలి మారింది, షుగర్, హైపటైటిస్ వంటి కాలేయ జబ్బులు పెరిగాయి. ఈ కారణంతో గుండెపోట్లు వస్తున్నాయి, దీనిపై జయదేవ ఆసుపత్రి ప్రజలను జాగృతం చేస్తోందన్నారు.
ఒత్తిడి, శ్వాసకోశ సమస్య, డయాబెటిస్, వాయుకాలుష్యం తో పాటు జీవనశైలిలో ప్రతికూల మార్పులు కారణమని తెలిపారు.
ప్రజలు భయపడరాదని, ఏడాదికి ఒకసారి గుండె పరీక్ష చేసుకోవాలని తెలిపారు.
కోవిడ్ టీకాతో గుండెపోట్లకు సంబంధం లేదన్నారు.

హృదయం క్షేమం

హృదయం క్షేమం

హృదయం క్షేమం