
దేవనహళ్లి భూసేకరణ రద్దు
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి తాలూకాలో ఏరో డిఫెన్స్ పరిశ్రమల కోసం భూమిని సేకరించడాన్ని నిరసిస్తూ 13 గ్రామాల రైతులు మూడున్నరేళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. 1117 ఎకరాల భూస్వాధీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళవారంనాడు విధానసౌధలో రైతులతో సమావేశమైన సీఎం ఈ మేరకు తెలిపారు. దేవనహళ్లి తాలూకాలో భూస్వాధీన నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకున్నట్టు తెలిపారు. అయితే కొందరు రైతులు తమ భూముల్ని ఇస్తామని ముందుకు వచ్చారని, వారి భూములను స్వాధీనం చేసుకుని మంచి పరిహారంతోపాటు అభివృద్ధి చేయబడిన భూమిని ఇస్తామని తెలిపారు. వ్యవసాయం చేయాలనుకునే రైతులు సంతోషంగా చేసుకోవచ్చన్నారు. దేవనహళ్లికి అతి సమీపంలో విమానాశ్రయం ఉన్నందున ఈ చుట్టుపక్కల అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కొత్త పరిశ్రమలు స్థాపించాలన్నారు. అప్పుడే అందరికీ ఉద్యోగాలు లభిస్తాయని, ప్రతి ఒక్కరి ఆదాయం పెరుగుతుందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి భూములు చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్, రైతు నేతలు పాల్గొన్నారు.
రైతులకు సీఎం అభయం

దేవనహళ్లి భూసేకరణ రద్దు