
గుహలోనే చాలా బాగుంది
దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం గోకర్ణలోని రామతీర్థం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలోని గుహలో ఇద్దరు పిల్లలతో రహస్యంగా నివసిస్తున్న రష్యన్ మహిళ నినా కుటినాను కాపాడి కార్వారలోని ఆశ్రయ కేంద్రంలో ఉంచారు. ఆమెను తిరిగి రష్యాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కుటినా ఆన్‌లైన్‌లో స్పందిస్తూ.. గుహలో తన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయేదని, అయితే ఆ జీవితం ముగిసిపోయిందని పేర్కొంది. అడవిలో ఏనాడు జంతువులు, పాముల వల్ల హాని కలగలేదని, ఇప్పుడు మనుషుల వల్ల ఇబ్బందులు వచ్చి పడ్డాయని వాపోయింది. ఇన్నాళ్లు ప్రకృతితో గడిపిన రోజులను జీవితంలో మర్చోపోలేనని, మనుషులు తమ చుట్టూ ఉన్న అన్నిటినీ నాశనం చేస్తారని పేర్కొంది. కుటినా, పిల్లలను తుమకూరులోని ఎఫ్‌ఆర్‌సీ కేంద్రానికి తరలించారు. రష్యన్ ఎంబసీ నుంచి అత్యవసర ప్రయాణ ఉత్తర్వు రాగానే వారిని పంపించివేస్తామని అధికారులు తెలిపారు.
రష్యన్ మహిళ కుటినా