
ఎమ్మెల్యేల బలప్రదర్శనకు గుర్రాల వ్యాపారం
హుబ్లీ: ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న ఆశతో ఎమ్మెల్యేలు తన తరుపున ఉన్నారని చూపించుకోవడానికి ధన బలం వాడుకొని గుర్రాల వ్యాపారానికి దిగారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్యనే కొనుగోళ్ల బేరం జరుగుతోంది. ఇది బహిరంగం కారాదని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే కాశప్పనవర్ అబద్ధాలు చెబుతున్నారు. అక్రమాలు చేసిన వారిపై మాత్రమే ఈడీ దాడికి భయపడాలి. అయితే కాశప్పనవర అలాంటి తప్పు ఏం చేశారు. డీకే.శివకుమార్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేదని సిద్దరామయ్య ప్రకటించడంతో కాంగ్రెస్‌లో అంతర్గత సలహాలు మొదలయ్యాయి. సీఎం, డీసీఎం ఒకరినొకరు మించి పోయే రీతిలో హైకమాండ్ ఎదుట తమ బలం ప్రదర్శించడానికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారంలో బీజేపీ పాలు పంచుకోవడం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్‌ను నియంత్రించలేక ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉందో వారే ముఖ్యమంత్రి అన్న స్థితికి వచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లకు పదవి విరమణ కావాలని సాధారణంగా చెప్పారన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీకి లీక్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదన్నారు. అలాంటి ఎటువంటి ప్రతిపాదన బీజేపీలో లేదు. భగవత్ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి