రిఫైనరీలో గ్యాస్‌ లీక్‌ | - | Sakshi
Sakshi News home page

రిఫైనరీలో గ్యాస్‌ లీక్‌

Jul 13 2025 7:43 AM | Updated on Jul 13 2025 7:43 AM

రిఫైనరీలో గ్యాస్‌ లీక్‌

రిఫైనరీలో గ్యాస్‌ లీక్‌

ఇద్దరు ఉద్యోగులు మృతి

యశవంతపుర: మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ సంస్థ (ఎంఆర్‌పీఎల్‌)లో గ్యాస్‌ పంపిణీ ప్రాంతంలో ట్యాంక్‌ నుంచి హానికర గ్యాస్‌ లీక్‌ కావటంతో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సీనియర్‌ ఆపరేటర్లు యూపీవాసి దీప చంద్ర (33), కేరళవాసి బిజిల్‌ ప్రసాద్‌ (33) మృతులు. సాధారణ తనిఖీల కోసం ట్యాంక్‌ ప్లాట్‌ఫారం ఎక్కారు. లీకైన వాయువులను పీల్చడంతో ఇద్దరు ట్యాంక్‌పైనే సృహతప్పి పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించిన మూడో ఆపరేటర్‌ వినాయక్‌ మైగేరి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అందరినీ ఆస్పత్రికి తరలించగా పై ఇద్దరూ చనిపోయారు. సంస్థ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించి, ఆస్పత్రికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు లీక్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు నగర పోలీసు కమిషనర్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

వైద్యం చేయించలేక

కూతురి హత్య

తండ్రికి జీవితఖైదు

యశవంతపుర: 11 ఏళ్ల కూతురికి పురుగుల మందు తాగించి హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.17 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా హెమ్మాడి గ్రామానికి చెందిన నాగరాజ పూజారి ఆర్థిక సమస్యలతో భార్య, పిల్లలపై దైహికంగా, మానసికంగా వేధించేవాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కుమార్తె నయన (11)కు వైద్యానికి చాలా ఖర్చవుతోందని నిత్యం గొడవపడేవాడు. ఇది తట్టుకోలే భార్య భర్తను, కూతుర్ని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. 2019 జనవరి 9న తాగిన మత్తులో నాగరాజు.. నయనకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. యల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జిల్లా కోర్టు జడ్జి ఈ మేరకు తీర్పు వెలువరించారు.

తప్పుడు ఆరోపణలతో

ఈడీ సోదాలు

ఎమ్మెల్యే సుబ్బారెడ్డి

భాగ్యనగరం (బాగేపల్లి): విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా ఆ మొత్తం ఆస్తులను అఫిడివిట్‌ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని బాగేపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి అన్నారు. తన నివాసాల్లో ఈడీ సోదాల తరువాత శనివారం బాగేపల్లికి వచ్చి సన్నిహితులతో సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాపై ఓడిపోయిన అభ్యర్థి నకిలీ ఆరోపణలతో కేసులు పెట్టి, ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు. దాడుల్లో ఈడీ అధికారులు కోరిన సమాచారం అంతా ఇచ్చానన్నారు. నేను విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా మొత్తం ఆస్తులకు ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని ఈడీకి చెప్పానన్నారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసం నాకు లేదు. సంవత్సరానికి రూ. 130 కోట్ల టర్నోవర్‌ ఉన్న వ్యాపారనేత్తని, నా పిల్లలు లగ్జరీ కార్లు కలిగి ఉండడం తప్పా అని ప్రశ్నించారు.

ఠాణాలో హల్‌చల్‌.. కటకటాలపాలు

యశవంతపుర: వంచన కేసులో అరెస్టయిన మహిళకు మద్దతుగా వచ్చిన ఓ వ్యక్తి ఠాణాలో హల్‌చల్‌చేసి కటకటాల పాలయ్యాడు. బెంగళూరు బసవేశ్వరనగర ఠాణాలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. సవిత అనే మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్లు కేసులున్నాయి. సవిత వద్దనున్న ఇంటి తాళం కోసం నిందితుడు యోగానంద (52) వచ్చాడు. ఇంటి తాళం ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దీంతో యోగానంద రెచ్చిపోయాడు, తాను న్యాయవాదినని, ప్రొఫెసర్‌నని, చాలామంది రాజకీయ నాయకులు తెలుసు, మీ సంగతి తేలుస్తానని అరుస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement