
గజలక్ష్మీదేవిగా చాముండేశ్వరి
మైసూరు : మూడవ ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలోని చాముండికొండ భక్తజనసంద్రమైంది. ఉదయం 7 గంటల నుంచి చల్లటి చిరు జల్లుల వర్షం పడుతున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా వేలాది మంది భక్తులు క్యూలో నిలబడి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పునీతులు అయ్యారు. కర్ణాటకతోపాటు చట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. చిత ప్రవేశంతో పాటు రూ.300, రూ.2000 టికెట్ కొనుగొలు చేసి క్యూలో వెళ్లి ఆమ్మవారిని దర్శించుకున్నారు. అనేక మంది మహిళలు, యువతులు,1001 మెట్లకు పసుపు కుంకుమ పెడుతూ మెట్లు ఎక్కుతు పైకి రావడం కనిపించింది.
ప్రత్యేక పూజలు...
నాడ శక్తి దేవత శుక్రవారం గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచే ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి రుద్రాభిషేకం, పంచామృ అభిషేకం, కుంకుమార్చన, ఏకాదశ పుష్పార్చన, సహస్ర నామార్చన నిర్వహించారు. తెలుపు రంగు, నేరేడు రంగు చీర ధరించి ప్రత్యేకమైన గజలక్ష్మీదేవి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయం మొత్తం వివిధ రకాల రంగు రంగుల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, ఎంపీ బీ.వై.రాఘవేంద్ర, గ్యారెంటీ పథకాల అమలు సమతి ఆధ్యక్షుడు హెచ్‌ఎం.రేవణ్ణ, ఎమ్మెల్యే ఏ.మంజు, కొత్తూరు మంజునాథ్, బాలకృష్ణ, ఎమ్మెల్సీ శరవణ, నటుడు వశిష్ట సింహ, నటి కారుణ్య, కలెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సిమా లాట్కర్‌తో పాటు అనేక మంది ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు.
కొండకు పోటెత్తిన భక్తజనం

గజలక్ష్మీదేవిగా చాముండేశ్వరి

గజలక్ష్మీదేవిగా చాముండేశ్వరి