రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,165 పెళ్లిళ్లు ● త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టానికి కొత్తగా సవరణలు ● రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,165 పెళ్లిళ్లు ● త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టానికి కొత్తగా సవరణలు ● రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సర్కార్‌

Jul 12 2025 9:49 AM | Updated on Jul 12 2025 9:49 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,

రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,

సాక్షి బెంగళూరు: బాల్యంలోనే మూడుముళ్ల రూపంలో బాలల స్వేచ్ఛకు సంకెళ్లు పడుతన్నాయి. వారి భవిత ఎండమావులుగా మారుతోంది. భవిష్యత్‌ అంధకారమవుతోంది. కలలు కళ్లలవుతున్నాయి. విరిసీ విరియని... తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు మాంగల్యం తుంతునానేనా అని అంటున్నారు. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేస్తున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. బాల్యంలోనే వివాహాలతో జరిగే అనర్థాలపై అధికారులు ఎంతగానో అవగాహన కలిగిస్తున్నా దురాచారాలను నిలువరించడం సాధ్యపడడం లేదు. ఈ క్రమంలో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కొత్తగా బాల్య వివాహ నిషేధ సవరణ చట్టం –2025ను తీసుకొచ్చేందుకు అడుగులు వేసింది. రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చి ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 2021–2022 నుంచి 2024–2025 వరకు మొత్తం 2,165 బాల్య వివాహాలు జరిగినట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. 2021–22లో 418, 2022–23లో 328 బాల్య వివాహాలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023–24లో బాల్య వివాహాలు మరింతగా పెరిగాయి. ఆ ఏడాది 719కి బాల్య వివాహాలు పెరిగాయి. ఇక 2024–25 ఏడాదిలో మరో 700 జరిగాయి. ఇలా కాంగ్రెస్‌ పార్టీ పాలనలో రెండేళ్లలో 1,416 బాల్య వివాహాలు జరిగాయి. 2024–25 ఏడాదిలో 700 బాల్య వివాహాలు జరిగాయి. మొత్తం 3,049 బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు అందితే అందులో 2,349 వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇందులో అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో 79 బాల్య వివాహాలు జరిగాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మిహెబ్బాళ్కర్‌ సొంత జిల్లా బెళగావిలో 78 బాల్య వివాహాలు జరిగాయి. రాష్ట్రంలో ఈ బెళగావి జిల్లా బాల్య వివాహాల అంశంలో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్రదుర్గ (74), బాగలకోటె (60), సీఎం సొంత జిల్లా మైసూరు (60), మండ్య (57) ఉన్నాయి.

నిశ్చితార్థం చేసిన వాళ్లకు జైలు శిక్ష

రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులో బాల్య వివాహం జరిగించడమే కాదు..నిశ్చితార్థం చేసినా నేరంగా పరిగణించేలా రూపొందించనున్నారు. బాలబాలికలకు నిశ్చితార్థం చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష అంతేకాకుండా రూ. లక్ష వరకు జరిమానా విధించేలా ఈ కొత్త సవరణ చట్టాన్ని తీసుకురానున్నారు. కేంద్ర చట్టంలో బాల్య వివాహం జరిగిస్తేనే నేరంగా భావించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త చట్టం ద్వారా నిశ్చితార్థం చేసినా వారిని నిందితులుగా చేర్చేలా సన్నాహకాలు చేస్తున్నారు.

కేంద్ర చట్టంలో సవరణకు ఏర్పాట్లు

ఇటీవలే కేంద్రంలో బాల్య వివాహా నిషేధ చట్టం –2006ను అమలు చేస్తున్నారు. దీనికితోడు బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు 2021 నుంచి పార్లమెంట్‌లో ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు–2025పై కసరత్తు చేస్తోంది. కేంద్ర బాల్య వివాహ నిషేధ చట్టం–2006లో కొన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపనుంది. ప్రస్తుత రాష్ట్ర బిల్లులో కేంద్ర మూల చట్టంలో కొత్త సెక్షన్లు అయిన 9ఏ, 13ఏను కూడా చేర్చనున్నట్లు తెలిసింది. అలాగే కేంద్ర చట్టం సెక్షన్‌ 10ని కూడా సవరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా కట్టుదిట్టంగా బాల్య వివాహ నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి వాటిని నియంత్రించాలని రాష్ట్ర సర్కార్‌ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement