
శ్రీశైల జగద్గురువును దర్శించుకున్న గాలి జనార్దనరెడ్డి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా
సాక్షి,బళ్లారి: పవిత్ర వ్యాసపూర్ణిమను పురస్కరించుకుని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి శ్రీశైల జగద్గురువులను దర్శించుకున్నారు. గురువారం గురపౌర్ణమి సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రతో కలిసి పరమపూజ్య శ్రీశైల జగద్గురువులు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మన పురాణ, ఇతిహాసాలు ఘోషిస్తున్నాయన్నారు. మన పూర్వీకుల నుంచి కూడా గురువుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గురువు లేనిదే ఎవరూ ఏదీ సాధించలేరన్నారు. గురువుకు గులాం అయ్యే వరకు మోక్షం దొరకదన్న పెద్దల వాక్కు నూటికి నూరు పాళ్లు కచ్చితం అన్నారు. అలాంటి పరమ పవిత్రమైన గురుపౌర్ణమి రోజు సాక్షాత్తు శ్రీశైల జగద్గురువులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.