గాలి జనార్దనరెడ్డి అభిమానుల సంబరాలు | - | Sakshi
Sakshi News home page

గాలి జనార్దనరెడ్డి అభిమానుల సంబరాలు

Jun 12 2025 3:49 AM | Updated on Jun 12 2025 3:49 AM

గాలి

గాలి జనార్దనరెడ్డి అభిమానుల సంబరాలు

సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కడంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం బళ్లారిలోని హవంబావి వద్ద గాలి స్వగృహం సమీపంలో ఆయన అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తమ నేతకు స్వేచ్ఛ లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. గాలి జనార్దనరెడ్డికి జైలు శిక్ష విధించిన తరువాత ఆయన సతీమణి గాలి లక్ష్మీ అరుణ కర్ణాటకలో పురాతన, చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఆ పూజలు ఫలించాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గంగావతిలో కూడా గాలి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

హైకోర్టు తీర్పుతో కుటుంబంలో ఆనందం

గాలి జనార్దనరెడ్డి అభిమానుల సంబరాలు 1
1/1

గాలి జనార్దనరెడ్డి అభిమానుల సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement