
గాలికి మేలు కోసం పూజలు, ప్రార్థనలు
సాక్షి,బళ్లారి: అక్రమ మైనింగ్ తవ్వకాల ఆరోపణలతో నాంపల్లి స్పెషల్ సీబీఐ కోర్టు గాలి జనార్ధన్‌రెడ్డికి జైలు శిక్ష విధించిన నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ లభించాలని, ఆయనకు మేలు జరగాలని దర్గాల్లో, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. శనివారం సిరుగుప్ప రోడ్డులోని వీరన్న కాలనీలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో గాలి జనార్దనరెడ్డి అభిమానులు ఉమారాజ్, కేఎస్ దివాకర్, హంపీరమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సమాజ ప్రముఖులు మున్నాభాయ్, రఫీక్ తదితరులు మక్దూమ్ జాని బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, హుండేకర్ రాజేష్, నూర్, మారేష్, వలి, గాదిలింగ పాల్గొన్నారు.

గాలికి మేలు కోసం పూజలు, ప్రార్థనలు