విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం
● శక్తి పథకం కింద రూ.450 కోట్లు లాభం
● రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సమయాల్లో అదనపు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లాలోని సిరవారలో నూతన బస్టాండ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సిరవారలో బస్‌డిపోను నరేగ పథకం కింద నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం కింద రూ.450 కోట్ల లాభం గడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బసవరాజ పాటిల్, నిర్మల, ఆర్టీసీ ఎండీ రాచయ్య, భూపనగౌడ, లక్ష్మి, అధికారులు శశిధర్, రవికుమార్, తిమ్మప్ప, శరణప్ప, చెన్నప్ప, రమేష్, రేణుకలున్నారు.
సెల్ అతిగా వాడొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
హుబ్లీ: బుద్ధిగా కాలేజీకి వెళ్లు బాబు, మొబైల్‌ను అతిగా వాడవద్దు అని మందలించినందుకు సదరు యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో చోటు చేసుకుంది. మృతుడిని సాగర్ తుకారాం కురడే (20)గా గుర్తించారు. సాగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదివేవాడు. మొబైల్‌ను విపరీతంగా వాడేవాడు. ఎప్పుడూ ఇంట్లో మొబైల్‌ను చేతపట్టుకొని అందులో మునిగి పోయేవాడు. బాబూ కాలేజీకి వెళ్లు అని తల్లిదండ్రులు మందలించినందుకు మొబైల్ నుంచి బయట పడలేదు. ఈ క్రమంలో సాగర్ నగ్రల్ గ్రామం తన ఇంటి ముందు ఉన్న పాత ఇంట్లోనే సాగర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ తండ్రి చిక్కోడి సీబీ కోరె సహకార చక్కెర కర్మాగారంలో కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. ఈయనకు సాగర్‌తో పాటు మరో కుమారుడు ఉన్నారు.
ఇసుక అక్రమ రవాణపై నిఘా ఏదీ?
రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లాధికారి నిఘా పెట్టాలని జనసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు జావేద్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో ఐదేళ్ల పాటు 65 బ్లాక్‌ల్లో కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్ట్‌లను రద్దు చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాతో రాజకీయ నాయకుల మద్దతుదారులు లబ్ధి పొంది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు.
ధరలు తగ్గించాలని నిరసన
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన నిరసనలో అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్ల పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
సీపీఐ(ఎంఎల్) కార్యకర్తల ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు వినియోగించే వస్తువుల ధరలను పెంచిందని, వాటి ధరలు తగ్గించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కార్యదర్శి నాగరాజ్ మాట్లాడారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి, నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం
విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం
విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం
విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం


