మళ్లీ జగనన్న పాలనకు కృషి
బనశంకరి: హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని సమర్థనం దివ్యాంగుల ట్రస్ట్‌లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తరువాత మధ్యాహ్నం 1 గంటకు కేక్ కటింగ్ నిర్వహించి బాలలకు పంచిపెట్టి అన్నదానం చేపట్టారు. ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు బీ.రమణారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో అన్నిరంగాల అభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమానికి కృషిచేశారని తెలిపారు. మళ్లీ 2029లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త సైనికునిగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాబు రాజేంద్రకుమార్, కాసినాయన ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, కల్లూరు హుసేనయ్య, ముత్యాల నారాయణరెడ్డి, కేఎల్.వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, కల్లూరి ఉస్మాన్, నయాబ్, నారాయణరెడ్డి, వీరనారాయణరెడ్డి, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
మళ్లీ జగనన్న పాలనకు కృషి


