జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు
సాక్షి,బళ్లారి: జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, ఇపుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్ననాటి స్నేహితుడు బాలస్వామి, నరాలరోషిరెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని గాంధీ నగర్‌లో శ్రీశివశక్తి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సూర్య నివాస్ వృద్ధాశ్రమంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వృద్ధుల సమక్షంలో కేక్ కోసి మిఠాయిలు, బ్రెడ్లు పంచి పెట్టారు. వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్పనాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనం వేచిచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.


