జగనన్న కోసం సమైక్యంగా కదలాలి: ఐటీ వింగ్
బనశంకరి: 2029లో మళ్లీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేయడానికి బెంగళూరులో నివసించే ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు కుమార్ పులివెందుల పిలుపునిచ్చారు. కృష్ణరాజపురం బెళతూరు శబరి ఆశ్రయధామలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదానం నిర్వహించారు. కుమార్ పులివెందుల మాట్లాడుతూ.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుని, అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్య, వైద్య, సంక్షేమ రంగాలను పూర్తిగా విస్మరిస్తూ ఆటవిక పాలన సాగిస్తోందని విమర్శించారు. గత జగనన్న ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఐటీ వింగ్ సభ్యుడు, పార్టీ కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీవింగ్ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, చంద్ర, అనిల్, పూల ప్రవీణ్, పూల సురేంద్ర, నరసింహారెడ్డి, రామ్, రుద్ర, అమర్, హరి, ఓబుళరెడ్డి, పర్వత శివశంకర్‌రెడ్డి, మురళీకృష్ణ, నారాయణరెడ్డి, సుబ్రమణ్యం, సంతోష్, శివకుమార్‌గౌడ్, నయాబ్ రసూల్, మహ్మద్ రఫీ, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
జగనన్న కోసం సమైక్యంగా కదలాలి: ఐటీ వింగ్


