బస్సును ట్యాక్సీ ఢీ..
● ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని మృతి
దొడ్డబళ్లాపురం: ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న కారు రోడ్డుపక్కన నిలిపి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతి చనిపోయింది, ఈ సంఘటన చిక్కజాల సమీపంలోని ఐటీసీ ఫ్యాక్టరీ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పని చేసే ఐ. స్నేహా (24), సహోద్యోగి అయిన కౌసర్ ఖానుం, కంపెనీ ట్యాక్సీ డ్రైవర్ వినయ్ (28)లు కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. త్వరగా వెళ్లాలని సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కారు ఢీకొట్టింది. కారు నుజ్జు కాగా స్నేహా అక్కడే మరణించింది. కౌసర్, వినయ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహ తమిళనాడులోని మధురైవాసి, అని బెంగళూరులో ఉంటూ ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బీటెక్ విద్యార్థి దుర్మరణం
కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాలు.. చిక్కజాలలో ప్రైవేటు కాలేజీలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ రెండో ఏడాది విద్యార్థి, కేరళ త్రిసూర్ నివాసి ఎల్దస్ (21) మృతుడు. శ్రీపాల్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై రూంకి వెళ్తుండగా గుమ్మనహళ్లి వద్ద కేఐఏడీబీ అపార్ట్‌మెంటు ముందు వేగంగా వచ్చిన కారు ఢీకొంది. పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.


