జగనన్న జన్మదినం సందర్భంగా నేటి నుంచి క్రికెట్ టోర్నీ
బనశంకరి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ఐటీవింగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ సర్జాపురలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ సారి టోర్నమెంట్‌ను పరిమిత జట్లతో నిర్వహించడంతో అందరికీ ఆటలో పాల్గొనే అవకాశం కల్పించలేక పోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శబరి ఆశ్రయధామలో
సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్ బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 21 తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కృష్ణరాజపురం శబరి ఆశ్రయధామ, బెళత్తూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని బెంగళూరు వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్ టీం తెలిపింది.
సర్జాపుర చేతన్ క్రికెట్ స్టేడియంలో ఐటీ వింగ్ క్రికెట్ టోర్నమెంట్


