ఆరోగ్య సేతు ప్రారంభించిన సీఎం
దొడ్డబళ్లాపురం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం బెళగావిలోని సువర్ణసౌధ ముందు ఆరోగ్య సేతు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మీ ఆరోగ్యం–మా బాధ్యత అనే నినాదంతో సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మొబైల్ హెల్త్ సెంటర్లు మారుమూల గ్రామానికి కూడా వెళ్లి సేవలు అందిస్తాయి. ప్రతి జిల్లాకు జనాభా, విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా ఈ వాహనాలను 1, 2, 3, 4 అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 81 వాహనాలను పంపించారు. వీటి నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.1686 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.


