శివాజీనగర: విద్యార్థి జీవిత ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ వార్షిక పరీక్షలు శుక్రవారం రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే ప్రథమ భాషా పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,818 కేంద్రాల్లో విద్యార్థులు సక్రమంగా పరీక్ష రాసేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ఆయా జిల్లా యంత్రాం, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్యా సాక్షరతా శాఖలు చేపట్టాయి. అన్ని కేంద్రాల బయట విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లను ప్రదర్శించారు. విద్యార్థులు కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరారు. 8.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాపీయింగ్‌ను నివారించేందుకు ప్రతి గదిలో సీసీటీవీ ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ 200 మీటర్లమేర నిషేధాజ్ఞలు విధించి జిరాక్స్ కేంద్రాలు మూసివేయించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలి రోజు సజావుగా పది పరీక్షలు