టీచర్‌ పాత్ర అనిర్వచనీయం | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ పాత్ర అనిర్వచనీయం

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కరీంనగర్‌ టౌన్‌: విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీ యమని అదనపు కలెక్టర్‌, డీఈవో అశ్వినీ తా నాజీ వాకడే అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆదివా రం విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వ హించారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచినవారిని ప్రశంసాపత్రాలు, నగదు బహుమతితో సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశ్వినీ తావాజీ వాకడే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత గురువుస్థానం గొప్పదన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, విద్యార్థులకు సదుపాయాలు, నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆర్డీవో మహేశ్వర్‌, డీఐఈవో వి.ఆంజనేయరావు, విద్యాశాఖ ఏడీ మాధవి, సెక్టోరల్‌ అధికారులు మిల్కురి శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి, దాసి శ్రీనివాస్‌, ఉమారాణి, మహేందర్‌, రవీందర్‌, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య పాల్గొన్నారు.

ఫాల్కన్‌ అథ్లెట్ల ఆత్మీయ సమ్మేళనం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఫాల్కన్‌ అథ్లెటిక్స్‌ క్లబ్‌ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 40ఏళ్ల క్రితం అథ్లెటిక్స్‌ కోచ్‌ స్వర్గీయ కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఏర్పాటు చేసుకున్న ఈ క్లబ్‌ సభ్యులంతా ఒకచోట కలుసుకుని, ఆనందంగా గడిపారు. జిల్లాకేంద్రంలోని వీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో క్లబ్‌ సభ్యులు 60మంది పాల్గొన్నారు. మొదట క్లబ్‌ సభ్యులుగా ఉండి మరణించిన క్రీడాకారులకు సంతాపం తెలిపారు. పలువురిని సత్కరించా రు. సభ్యులందరూ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అథ్లెటిక్స్‌ పోటీల్లో రాష్ట్ర,జాతీయస్థాయిలో ప్రతిభ చాటే వారికి ప్రోత్సాహకాన్ని అందించాలని తీర్మానించారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సా రంగపాణి, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, సుమన్‌ కల్యాణ్‌, రిటైర్డ్‌ ఎస్పీ మురళి, వరంగల్‌ రేంజ్‌ ఏసీపీ నరేందర్‌, పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌, రిటైర్డ్‌ ఎస్సై నందెల్లి శేఖర్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, సర్పంచ్‌ కర్పూజ తిరుపతి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌, టీజీపెట రాష్ట్ర కార్యదర్శి నాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

ఉన్నతస్థాయికి చేరుకోవాలి

కరీంనగర్‌ సిటీ: విద్యార్థులు తమ ప్రతిభను అ భివద్ధి చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వరలక్ష్మి తెలి పారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. వివిధ కార్యక్రమాలపై నివేదికను కామర్స్‌ విభాగ అధ్యాపకురాలు, కమిటీ సభ్యురాలు జె.స్వప్న సమర్పించారు.

సిటీలో పవర్‌కట్‌

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు ఏబీ స్విచ్‌ల మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్‌కాలనీ, ఉజ్వల పార్కు ఫీడర్ల పరిధిలోని సప్తగిరి కాలనీ, కొత్త పీహెచ్‌సీ సెంటర్‌, ప్రభుత్వ హైస్కూల్‌ లైన్‌ నుంచి బైపాస్‌ రోడ్‌, సప్తగిరిహిల్స్‌ రోడ్డు నంబర్‌ 3,4,5, జానకీ వీధి రోడ్‌ నంబర్‌ 1,2,3, ఏవోస్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 1,2,3,4, రామచంద్రాపూర్‌కాలనీ రోడ్‌ నంబర్‌10.13.16.18,20, బైపాస్‌ రోడ్‌ హెచ్‌పీ గ్యాస్‌ గోదాం, వెంకటాద్రికాలనీ, శ్రద్ధ ఇన్‌ హోటల్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, డిమార్ట్‌, బైపాస్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement