కోనరావుపేట: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాయమైన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా యాజ్ఞచార్యులు మరిగంటి రామగోపాలచార్యులు, అర్చకులు రంగనాయకుల శ్రీనివాస్, తిరునహరి కృష్ణ, లక్ష్మణ్ అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ముస్తాబు చేసిన వేదికలో శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఆసీనులు చేశారు. హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ కాసర్ల పవిత్ర, వార్డుసభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


