వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం

Mar 27 2026 9:22 AM | Updated on Mar 27 2026 9:22 AM

వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం

కొత్తపల్లి(కరీంనగర్‌): వ్యాపారవేత్తగా ఎది గేందుకు ఆత్మవిశ్వాసం ముఖ్యమని అల్ఫో ర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి అన్నారు. కరీంనగర్‌ సూర్యనగర్‌లోని ఆల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కరస్పాండెంట్‌ వి.రవీందర్‌ రెడ్డి అధ్యక్షతన ‘ఆవిష్కార్‌–2026’ పేరిట గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కామర్స్‌– మేనేజ్‌మెంట్‌ మీట్‌కు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువ త చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తగా రాణించేందుకు స్పష్టమైన ఆలోచనతో మార్కెట్‌ను పరిశోధించి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌తో తొలుత చిన్నగా ప్రారంభించాలన్నారు. స్కిల్క్‌ డెవలప్‌ చేసుకుంటూ నెట్‌వర్కింగ్‌ పెంచుకుంటూ మార్కెటింగ్‌పై ఫోకస్‌ చేయాలని, ఇందులో ఫెయిల్యూర్స్‌ను కూడా స్వీకరించాలని సూచించారు. వి.రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి మీట్‌లు దోహదపడతాయన్నారు. రాష్ట్రస్థాయి కామర్స్‌–మేనేజ్‌మెంట్‌ మీట్‌లో యంగ్‌ మేనేజర్‌, యంగ్‌ కామర్స్‌ అవార్డ్‌, కార్పొరేట్‌ వాక్‌, స్ట్రెస్‌ ఇంటర్వ్యూ, నర్తనశాలతో పాటు 19 రకాల పోటీలు నిర్వహించామని, ఇందులో 15 కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాని తెలిపారు. ఓవరాల్‌ చాంప్‌గా నిలిచిన హన్మకొండ వాగ్ధేవి డిగ్రీ కళాశాల విద్యార్థులకు శాతవాహన యునివర్సిటీ కామర్స్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభా గాధిపతి డా.హరికాంత్‌ బహుమతులు అందించారు.

అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement