కరీంనగర్‌రూరల్: బొమ్మకల్‌లోని ట్రినిటి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ 94 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారిని ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, డైరెక్టర్ రాజగోపాల్, ఏవో రాజశేఖర్‌రెడ్డి, ప్లేస్‌మెంట్ అధికారి ప్రవీణ్‌కుమార్, హెచ్‌వోడీలు రజిత, శ్రీధర్, బలరాం పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): లోయర్ మానేరు డ్యాంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టిన ప్రొక్లెయిన్, టిప్పర్లను కొత్తపల్లి పోలీసులు సీజ్ చేశారు. కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ వివరాల మేరకు ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని నీటి పారుదలశాఖ ఏఈఈ సీహెచ్ కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 23న కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా కిట్టండ్రు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన శివసత్య ఇంజినీరింగ్ కంపెనీ సూపర్‌వైజర్ గుర్రం రవి గత కొద్దిరోజులుగా ఎల్‌ఎండీలో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. రవిని అదుపులోకి తీసుకుని, రెండు టిప్పర్లు, ఒక ప్రొక్లెయిన్‌ను సీజ్ చేశారు.


