కీళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆయుష్ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. రోగం నయమైంది. అవసరమైన అన్నిరకాల పరీక్షలను కూడా ఇక్కడి టీహబ్‌లోనే చేయించారు. ఆస్పత్రికి వస్తే అన్ని వసతులు ఉండడంతో పాటుమందులు కూడా అందిస్తున్నారు.
– నిర్మల, సుల్తానాబాద్
సేవలందిస్తున్నాం
జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. మందుల కొరతను అధిగమించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవసరమైన అన్నిరకాల మందులను తెప్పించి అందుబాటులో ఉంచారు. పేషెంట్లకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ మారుతి, ఆయుష్ ఆస్పత్రి ఇన్‌చార్జి


