● రాచర్ల బొప్పాపూర్‌లో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్‌ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్‌లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
పాముకాటుతో వృద్ధురాలి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.


