వేములవాడ: పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ 84 మందిని కోర్టులో హాజ రుపరిచినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 17 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 46 మంది కి రూ.2వేలు చొప్పున జరిమానా, 21 మందికి రూ.4వేలు చొప్పున జరిమానా విధిస్తు వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెల్లడించినట్లు వివరించారు. మందుబాబులకు ఎస్సైలు రామ్మోహన్, సముద్రాల రాజు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు
పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వారికి జైలుశి క్ష, జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్‌చార్జి జ డ్జి మంజుల బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫి క్ సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామ న్నారు. వారిలో శాంతినగర్‌కు చెందిన నల్గొండ కోటేశ్వర్‌కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌కు చెందిన జగదీశ్‌కు మూ డురోజులపాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారని వివరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో సమ్మర్ స్పెషల్ రైలు
రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్‌లో హైదరాబాద్ – గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్‌పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్‌పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్‌లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రెండిళ్లలో చోరీ
చొప్పదండి: రెవెళ్లిలోని రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇరుగురాల సరీన్ కుమార్ నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో బంధువు చనిపోతే ఇంటికి తాళం వేసి కుటుంబంతో వెళ్లాడు. బుధవారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. పోలీసుల విచారణలో సరీన్ ఇంటిలో అరతులం బంగారం పోయినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో విచారణ జరుపుతున్నారు. కాగా సరీన్ ఇంటి సమీపంలో నివాసం ఉండే రేకుల లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. లక్ష్మారెడ్డి ఖమ్మం జిల్లాలో ఉండే తన చిన్న కూతురు దగ్గరకు వెళ్లడం, అక్కడే ఉండటంతో చోరీకి ఏ వస్తువులు గురయ్యాయో తెలియలేదు. సరీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


