కరీంనగర్‌సిటీ: పరిశోధనలే సమస్యల పరిష్కారానికి మూలమని శాతవాహన యూనివర్సిటీ కామర్స్, మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డి.హరికాంత్ అన్నారు. ఎస్సారార్ కళాశాలలో కామర్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ హైదరాబాద్ సౌజన్యంతో విద్యార్థులకు పరిశోధన పద్ధతులు, ప్రాజెక్టు రిపోర్ట్ తయారీపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ప్రొఫెసర్ వై.రామకృష్ణ, ఏ.రాకేశ్ ఫణీంద్ర పరిశోధన అంశం ఎంపిక, రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ గురించి వివరించారు. హరికాంత్ మాట్లాడుతూ... విద్యార్థులు వ్యాపార వాణిజ్య రంగాల్లోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలనే ఉద్దేశంతోనే ఈ పరిశోధన ప్రాజెక్టు రిపోర్టు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, కామర్స్ విభాగాధిపతి రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు సురేందర్ రెడ్డి, బుర్ల నరేశ్ పాల్గొన్నారు.


