ఆక్రమణలకు అడ్డా..!
నగరంలోని శనివారం అంగడి చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఆర్ కాంప్లెక్స్‌లోని దుకాణదా రులు ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలు తొలగించినా.. కొద్ది రోజులకు షరా మా మూలుగానే ఫుట్‌పాత్‌తోపాటు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు.
నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే కరీంనగర్, సిరిసిల్ల మెయిన్ రోడ్డుపైనే దుకాణాలున్నాయి. టూటౌన్ పోలీసుస్టేషన్ ముందున్న షాపు ఏకంగా రోడ్డుపైనే కొనసాగుతోంది. ఇక్కడ ఫుట్‌పాత్‌లే కాదు.. రోడ్డుపై వైట్ లైన్ కూడా కనిపించని పరిస్థితి. గతంలో బల్దియా అధికారులు తొలగించినా.. మళ్లీ యథాస్థానంలోనే వ్యాపార సామగ్రి ఆక్రమించుకుంది.
ఆక్రమణలకు అడ్డా..!
ఆక్రమణలకు అడ్డా..!


