సెంచరీ కొట్టిన బీజేపీ
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టు పెంచుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో వంద సీట్లకు పైగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటారు. తొలి, మలి దశలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 76 స్థానా లను కై వసం చేసుకుంది. గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడలోని విజయనగర్ కాలనీ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా 112 స్థానాల్లో పోటీ చేస్తే బుధవారం వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే అందులో 24 స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంది. మూడు దశలో బీజేపీ సెంచరీ కొట్టింది. గెలిచిన అభ్యర్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్‌లకు అభినందన
కరీంనగర్ కార్పొరేషన్/చిగురుమామిడి: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఇటీవల విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో మంత్రులను కలిశారు. మంత్రులు సర్పంచ్‌లను సన్మానించారు. రేకొండ సర్పంచ్ అల్లెపు సంపత్ కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి పొన్నం కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో చర్లభూత్కూర్, చామనిపల్లి, దుబ్బపల్లి బహదూర్‌ఖాన్ పేట్, జూబ్లీ నగర్, ఎలబోతారం, ఫకీర్‌పేట్, చేగుర్తి, నల్లగుంటపల్లె, ఓగులాపూర్, ఇందుర్తి, లంబాడిపల్లి, సీతారాంపూర్, నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పెన్షన్ భిక్ష కాదు.. హక్కు
కరీంనగర్ అర్బన్: పెన్షనర్లకు పెన్షన్ భిక్ష కాదని రాజ్యాంగబద్ధమైన హక్కని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ పెన్సనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, కార్యదర్శి ఎలదాసరి లింగయ్య అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ.. తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని, పెన్షనర్లు ఎవరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసయ్య, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కోశాధికారి కిరణ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెంచరీ కొట్టిన బీజేపీ


