పట్టు పెంచుకున్న ‘బండి’
● ఈటల బలపర్చిన అభ్యర్థి ఒక్కరే గెలుపు
హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అభ్యర్థులను బరిలో దింపిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈట ల రాజేందర్‌కు భంగపాటు ఎదురైంది. మెజారి టీ గ్రామాల్లో అభ్యర్థులను పోటీలో దింపగా.. పోతిరెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థి సుమలత సురేందర్ మాత్రమే గెలుపొందారు. హుజూరాబాద్ మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బలపర్చిన అభ్యర్థులు ఐదుగురు గెలుపొందారు. కందుగుల, బొత్తలపల్లి సర్పంచ్ అభ్యర్థులు మహేశ్, బాసవోయిన శ్రీనివాస్ ఉన్నా రు. రాంపూర్‌లో ముశం సంగీత గణేశ్ స్వతంత్రులుగా పోటీ చేసి వెంటనే బీజేపీలో చేరారు. శాలపల్లి సర్పంచ్‌గా గెలిచిన కొడిగూటి ప్రవీణ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిన్న పాపయ్యపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి బండి సంజయ్ అభిమాని. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఒకటి, రెండ్రోజుల్లో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.


