ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
హుజూరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే శాఖాఫరమైన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం అన్నారు. మూడో విడత ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం డివిజన్‌వ్యాప్తంగా హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ వేళ ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలా భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. నిబంధనలకనుగుణంగా విధులను నిర్వర్తించాలని అన్నారు. ఏసీపీ మాధవి తదితరులున్నారు.


