సర్వేకు సహకరించాలి
కుష్ఠు రహిత ఉన్నతమైన సమాజం కోసం చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలి. వైద్యసిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శరీరంపై మచ్చలు చూపించాలి. కుష్ఠు మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి, నిర్ధారిస్తారు. ఇలాంటివారి వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తాం. ముందస్తు చికిత్స చేస్తే వ్యాధి సులువుగా నయం చేయవచ్చు. – వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్
మందులు ఉచితం
ఈనెల 18వ తేదీ నుంచి వైద్యసిబ్బంది ఇంటింటా లెప్రసీ సర్వే చేస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారికి సహకరించాలి. మచ్చలు ఉంటే వారు పరిశీలిస్తారు. గోధుమరంగుతో కూడిన మచ్చలు ఉంటే సిబ్బందికి చూపించాలి. వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే ప్రభు త్వమే పూర్తిస్థాయిలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. – సుధాకర్ రెడ్డి, లెప్రసీ
ప్రోగ్రాం ఆఫీసర్, పెద్దపల్లి
సర్వేకు సహకరించాలి


