సామాజిక సేవలో మేము సైతం
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించి విరమణ పొంది సంఘటితమై సంఘం ఏర్పర్చుకున్నారు. తమ హక్కుల సాధనకోసమే కాకుండా వృద్ధులకు మూడు నెలలకోసారి ఉచిత వైద్యశిబిరాలు, యోగాశిక్షణ తరగతులు, చెట్లు, మొక్కలు నాటడం, గ్రంథాలయంలో పఠనం సాగించడం, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడం, చలివేంద్రాల ఏర్పాటు లాంటి సేవా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం పెన్షనర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
గ్రంథాలయం, చెస్, క్యారం..
పెన్షనర్ భవన్‌లో ఒక గదిలో గ్రంథాలయం, హాల్‌లో టీవీతో పాటు, క్యారం, చెస్ ఆడేందుకు గదులతో పాటు దినపత్రికలు అందుబాటులో ఉంటాయి. రూ.2లక్షల విలువైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉండడంతో వివిధ పుస్తకాలు చదవడం పెన్షనర్లు అలవాటుగా మార్చుకున్నారు. అలాగే సంఘం సభ్యుల కుటుంబ సభ్యులు చనిపోతే గ్రూప్‌గా వెళ్లి నివాళి అర్పిస్తారు.
నేడు వేడుకలు
ఇందిరానగర్‌లోని పెన్షనర్స్ భవన్ కార్యాలయంలో 75 ఏళ్లు నిండిన పెన్షనర్ల దంపతులను బుధవారం సన్మానించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిగా డిప్యూటీ డైరెక్టర్ యు. నాగరాజు హాజరుకానున్నారు. టీఎన్‌జీవో భవన్‌లో పెన్షనర్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 మండలాల్లో 31 శాఖలతో 300 మండల యూనిట్లతో 15 వేల మంది పెన్షనర్ల సభ్యత్వంతో సొంత భవనాలు ఏర్పర్చుకోని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విజయవంతం చేయాలి
కరీంనగర్ అర్బన్: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం టీఎన్జీవో భవన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేఽశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలదాసరి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ పెన్షనర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెన్షనర్లు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం.. సేవా కార్యక్రమాలు
నెలనెలా సమావేశాలు
జిల్లాలో 15 వేల మంది పెన్షనర్లు
నేడు పెన్షనర్స్ డే


