జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్..
జగిత్యాల: ‘నీ వ్యక్తిగత పనుల కోసం జగిత్యాల ఆ త్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్.. కోరుట్ల వారు జి ల్లాకేంద్రానికి వస్తున్నారని అంటున్నావ్.. జిల్లాకేంద్రం అందరిదీ.. ఎవరైనా రావచ్చు.. మెడికల్ కళా శాల విద్యార్థులకు మంచి విద్య అందాలని అడిగే హక్కు నాకూ ఉంది. నేను వ్యక్తిగత విమర్శలు చే యలేదు..’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై ఫైర్ అయ్యా రు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ కా ర్యాలయంలో మాట్లాడారు. తన కృషితోనే జగిత్యాలకు మెడికల్ కళాశాల వచ్చిందని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పరి పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల మంజూరు చేశారని చెప్పారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు ఒక డాక్టర్‌గా మంచి విద్య అందాలని సందర్శించడం తప్పా.. అని ప్రశ్నించారు. తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. సంజయ్ కుమార్‌లో ఆత్మవిశ్వాసం తక్కువ.. అభద్రత ఎక్కువగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లా అంటే ఏంటి..? జిల్లాలో ఏమేం ఉంటాయి..? ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని సూచించారు. తన నాన్న కాంట్రాక్టర్ కాదని, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి ఆస్పత్రుల గురించి అసెంబ్లీలో అడిగి హక్కులు సాధించుకున్నానని, తాను కోరుట్లలో రాజీనామా చేస్తా.. సంజయ్ జగిత్యాలలో రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. ఆయన వెంట మారు సాయిరెడ్డి, రాజేశ్, దశరథరెడ్డి, లక్ష్మీరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నట్లు?
కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లా ఏర్పాటు చేశారు
జిల్లాకేంద్రానికి అందరూ వస్తారు.. అందులో తప్పేంటి..?
నేను రాజీనామా చేస్తా... నువ్వు రాజీనామా చేయ్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్


