సమస్యల పరిష్కారానికి కృషి
పెన్షనర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గ్రంథాలయం, టీవీ ఇతరత్రా అన్నిరకాల పుస్తకాలు ఏర్పాటు చేసి భవనంలో యోగా, సాహిత్యం తరగతులు నిర్వహిస్తున్నాం. పింఛన్‌దారులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం. ఏటా డిసెంబర్ 17న పెన్షనర్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం.
–మోసం అంజయ్య, రిటైర్డు
ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఆనందంగా ఉంది
ఉద్యోగ విరమణ అనంతరం అంతా ఒకచోట కలిసి కూర్చోవడం, ఒకరి బాధల్ని మరొకరు పంచుకోవడం, సామాజిక సేవల్లో భాగస్వామ్యమవడం ఆనందంగా ఉంది. ఒంటరి వాళ్లం కాదు అన్న సంకేతాన్ని పింఛన్‌దారులకు అందిస్తున్నాం. సామాజిక సేవలో భాగస్వాములమవుతాం.
–దామెర మహేందర్‌రెడ్డి,
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
బస్‌చార్జీల్లో రాయితీ కల్పించాలి
మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వం కూడా రిటైర్డు ఉద్యోగులకు బస్సు ప్రయాణాల చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. 65 ఏళ్లు నిండిన పెన్షనర్‌కు పంజాబ్ రాష్ట్రం ఇస్తున్నట్లు అదనపు పెన్షన్‌ను జమచేయాలి.
–దాసరి రామయ్య, పెన్షనర్
సమస్యల పరిష్కారానికి కృషి
సమస్యల పరిష్కారానికి కృషి


