రేకుర్తి కంటి ఆసుపత్రికి విరాళం
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా.భాస్కర్ మడేకర్ ఉదార నేత్ర వైద్యశాలకు ఐడీబీఐ బ్యాంకు రూ.74,08,700 భారీ విరాళం సీఎస్‌ఆర్ కింద అందజేసినట్లు ఆసుపత్రి చైర్మన్ కె.వేణుమూర్తి తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రెటీనా డిపార్ట్‌మెంట్‌లో మాడ్యులర్ మూడు ఆపరేషన్ థియేటర్లు, అశోక్ ల్యాండ్ బస్ గురించి ఈ విరాళం డబ్బును ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ ఆపరేషన్లతోపాటు గ్లకోమా, మెల్లకన్ను, రెటీనా వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ గురువారం ఉచితంగా కంటి(తెల్ల రేషన్ కార్డు, 50 ఏళ్ల వయస్సు తప్పనిసరి) ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉన్న రెటీనా డిపార్టుమెంటును సుమారు రూ.5కోట్ల బడ్జెట్‌తో రేకుర్తి ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేణుమూర్తితోపాటు ఆసుపత్రి ప్రతినిధులు సురేశ్, ప్రకాశ్‌హొల్లా, పవన్‌కుమార్, ఇంజనీర్ అన్నారెడ్డి, డా.టి.మురళీధర్‌రావు, శరత్‌కృష్ణ, శివకాంత్ కృతజ్ఞతలు తెలిపారు.


