కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్‌మెంట్ పరీక్షకు స్పందన
కరీంనగర్ టౌన్: కరీంనగర్‌లోని కోట పబ్లిక్ స్కూల్ ఆదివారం నిర్వహించిన టాలెంట్ ఎంకరేజ్‌మెంట్ పరీక్ష– 2026కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుత సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100శాతం స్కాలర్‌షిప్‌తో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతిభను ప్రోత్సహించడమే కోట పబ్లిక్ స్కూల్ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులకు బలమైన అకాడమిక్ ఫౌండేషన్‌తో పాటు విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా శిక్షణ ఉంటుందని వివరించారు.


