పనిమంతులకు ఎన్నికళ!
సిరిసిల్లటౌన్: పల్లెపోరులో పనిమంతులకు చేతినిండా పని ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకు ఎన్నికల ఉపాధితో సంతోషంగా ఉంటున్నారు. సాధారణ రోజుల్లో తక్కువగా ఉండే పనులు ఇప్పుడు పొద్దస్తమానం ఉండడంతో నాలుగురాళ్లు సంపాదిస్తూ... ఉత్సాహంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో లైటింగ్, ప్రింటింగ్, ఫ్లెక్సీ ఏర్పాటు, ఆటో తదితర కార్మికులు, చిరువ్యాపారులకు సర్పంచ్ ఎన్నికల ఆర్డర్లు కలిసి వస్తున్నాయి. పక్షం రోజులు ఉండే సీజనల్ ఆర్డర్లు వస్తుండడంతో మూడు పూటలు కష్టపడుతూ.. మెరుగైన ఉపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో ఎన్నికలు ఉపాధి పొందుతున్న కష్టజీవులపై కథనం..
సిరిసిల్లలో ఎలక్షన్ జోష్
మార్కెట్‌కు సర్పంచ్ ఎన్నికల హోష్
ప్రచార కార్మికులకు సీజనల్ ఉపాధి
పక్షం రోజులుగా ఎడతెరపి లేకుండా పనులు
పనిమంతులకు ఎన్నికళ!
పనిమంతులకు ఎన్నికళ!


