మాకివ్వండి!
మా పైసలు
‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలి తాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పు ల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజ యం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలు సుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్ట లు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా నాలుగు ఓట్లు పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
మూడో విడతకు గుణపాఠం
తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వే స్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచా ల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.
‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’
‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’.
మాకివ్వండి!


