మా ప్రాణాలు కాపాడండి
● డంప్‌యార్డ్‌లో ప్లకార్డులతో నిరసన
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం గారూ...డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తారా... చనిపోతుంటే చూస్తూ ఉంటారా.. మా ప్రాణాలు కాపాడండి...అంటూ డంప్‌యార్డ్ బాధితులు వినూ త్న రీతిలో నిరసన తెలిపారు. నగరంలోని అలకాపురికాలనీకి చెందిన సామాజిక కార్యకర్తలు దుంపేటి రాము, ఉమర్ అన్సారీ, రాజు, శ్రీనివాస్ శనివారం డప్‌యార్డ్‌లో నిరసనకు దిగారు. సీఎం సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. నగరంలోని రాజీవ్ రహదారి బైపాస్ వద్ద ఉన్న డంప్‌యార్డ్‌తో సమీప కాలనీల వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపా రు. డంప్‌యార్డ్ మూలంగా వెలువడుతున్న విషవాయువులతో సమీప ప్రాంత వాసులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన చెందారు.
చొప్పదండి/కరీంనగర్ టౌన్: పీఎంశ్రీ నవోద య విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6,812 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,113 మంది హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా నుంచి 1,497, జగిత్యాల జిల్లా నుంచి 1,858, పెద్దపల్లి జిల్లా నుంచి 731, సిరిసిల్ల జిల్లా నుంచి 671, సిద్దిపేట జిల్లా నుంచి 159 మంది, హన్మకొండ జిల్లా నుంచి 58, జయశంకర్ జిల్లా నుంచి 133 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. నగరంలోని భగవతి పాఠశాలలోని పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏడు జిల్లాల నుంచి ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షించి ప్రవేశ పరీక్షను విజయవంతం చేశారని, వారికి నవోదయ ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి వరకు ఐడీసీఎంటీ పనులు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: సంక్రాంతి నాటికి ఐడీఎస్‌ఎంటీ భవన మరమ్మతు పనులు పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఐడీఎస్ ఎంటీ భవన మరమ్మతు పనులను, సిక్‌వాడీలోని సుడా భవన నిర్మాణ పనులను పరి శీలించారు. వచ్చే సంక్రాంతి పండగ వరకు ఐడీఎస్‌ఎంటీ భవన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సుడా భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. మార్చి వరకు మొదటి దశ పనులు పూర్తి చేయాలన్నారు. డీఈ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఇన్‌స్టాలో మాక్ పోలింగ్
చిగురుమామిడి: నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల సైలెంట్ పీరియడ్‌లో ఇన్‌స్టాలో గ్రామంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారని మాక్ పోలింగ్ నిర్వహించారు. బహిరంగంగా ఆన్‌లైన్ వేదికగా ఇన్‌స్ట్రాగామ్‌లో ఇలాంటి చర్యలు నేరమని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ ఇన్‌స్ట్రాగామ్ పేజీలో జీపీ ఎన్నికలపై శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఇదే గ్రామానికి చెందిన మంథని శ్రీకాంతాచారి జిల్లా ఎన్నికల సహాయ అధికారి, చిగురుమామిడి తహసీల్దార్ ముద్దసాని రమేశ్‌కు ఫిర్యాదు చేశాడు. ఇలా చేయడం ఎన్నికల నింబధనలకు విరుద్ధమని జిల్లా సహాయ ఎన్నికల అధికారి రమేశ్ తెలిపారు. శ్రీకాంతాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని చిగురుమామిడి పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మాక్ మాక్ పోలింగ్ నిర్వహించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని సైబర్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు.
మా ప్రాణాలు కాపాడండి
మా ప్రాణాలు కాపాడండి


