ఎస్‌యూకు రూ.100 కోట్లు కోరుతాం
కరీంనగర్‌కార్పొరేషన్/సప్తగిరికాలనీ: శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటా యించాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులంతా కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతామని బీసీ సంక్షేమ,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. శాతవాహన యూనివర్సిటీని అభివృద్ధి చేయాలంటూ వీసీ ఉమేశ్‌కుమార్ శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇటీవల ఉస్మానియాయూనివర్సిటీ అభివృద్ధికి రూ.1 వేయి కోట్లు కేటాయించిందని తెలిపారు. అదే తరహాలో ఉత్తర తెలంగాణలోని చారిత్రాత్మక శాతవాహనయూనివర్సిటీ అభివృద్ధికి రూ.100కోట్లు కావాలని కోరుతామని చెప్పారు. భవిష్యత్‌తరాలను తీర్చిదిద్దే ఈ యూనివర్సిటీకి రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వీసీకి సూచించారు. ఈ ప్రతిపాదనలను తాము సీఎం వద్దకు తీసుకెళ్లి, కేటాయించేలా కృషి చేస్తామన్నారు.


