ఎస్‌ఐఆర్‌లో బీఎల్‌వోలది ముఖ్యపాత్ర
కరీంనగర్‌కార్పొరేషన్: స్పెషల్ ఇన్‌టెన్సీవ్ రివిజన్(ఎస్‌ఐఆర్)ప్రక్రియలో బీఎల్‌వోలు, సూపర్ వైజర్లు ముఖ్య పాత్ర పోషించాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతిలో బూత్ లెవల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో బీఎల్‌వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరించి ధ్రువీకరించాలన్నారు. ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండేలా చూసుకోవడం బీఎల్‌ఓల ప్రధాన బాధ్యత అన్నారు. సమావేశానికి హాజరుకానివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో మహేశ్వర్, కొత్తపల్లి తహసీల్దార్ వెంకటలక్ష్మి, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ రాజేశ్, సహాయ కమిషనర్ దిలీప్, ఎస్‌ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు.


